గీతా ఆర్ట్స్ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.?

569చూసినవారు
గీతా ఆర్ట్స్ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.?
తెలుగుచిత్ర పరిశ్రమలో గీతా ఆర్ట్స్ సంస్థ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చిందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. గీతా ఆర్ట్స్ ఓనర్ అల్లు అరవింద్ ఇటీవల మాట్లాడుతూ.. తన సంస్థకు ఏ పేరు పెడదామని అల్లు రామలింగయ్య, ఆయన పార్టనర్స్ ఆలోచిస్తున్న సమయంలో గీతా ఆర్ట్స్ పేరును సజెస్ట్ చేశానన్నారు. గీత అంటే భగవత్ గీత అని అర్ధం. అందులో చెప్పినట్టుగా ప్రయత్నం మాత్రమే చేయాలి ప్రతిఫలం మన చేతిలో ఉండదు. చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అందుకే గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టినట్లు అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్