తెలంగాణ వ్యాప్తంగా పండిన పంట ఎంత.. కొన్న ధాన్యం ఎంత? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రశ్నించారు. 'ఎంత ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చారు? 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 5.19 లక్షల క్వింటాళ్ల సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇచ్చారని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకారం రైతులకు దక్కిన బోసన్ రూ.25.98 కోట్లే. ప్రభుత్వం కొన్నది పిసరంత.. కోతలు కొండంత. పండగలాంటి వ్యవసాయం.. కాంగ్రెస్ పాలనలో దండగగా మారింది' అని ఎద్దేవా చేశారు.