తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.18 వేల కోట్లతో 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికే రుణమాఫీ చేయగా, తాజాగా మహబూబ్ నగర్ సభ నుంచి మరో 3,13,897 మంది రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేస్తూ అందుకు అవసరమైన రూ.2747.67 కోట్లను సీఎం విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన నిధులతో రాష్ట్రంలో మొత్తంగా 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల మేరకు రుణమాఫీ జరిగింది. ఈ నిధులను సీఎం వర్చువల్‌గా విడుదల చేశారు.