యాపిల్ కు భారీ నష్టాలు

78చూసినవారు
యాపిల్ కు భారీ నష్టాలు
ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ పై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఈ సంస్థ అక్రమంగా గుత్తాధిపత్యం సాధిస్తోందని ఆరోపించింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పతనమయ్యాయి. దాదాపు 4.1 శాతం మేర నష్టాల్లోకి వెళ్ళాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే 113 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.9.41 లక్షల కోట్లు) ఆవిరైంది. ఈ ఏడాది కంపెనీ షేరు విలువ 11 శాతం వరకు కుంగడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్