అమెరికాలో హరికేన్ ‘హెలెనా’ బీభత్సం సృష్టించింది. ఆగ్నేయ అమెరికా ప్రాంతంలో ఇప్పటివరకు 44 మంది మృతి చెందారని అధికారులు ప్రకటించారు. ఫ్లోరిడాతో పాటు జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా ప్రాంతాల్లో హరికేన్ పెను ప్రభావం చూపించింది. తుఫాను కారణంగా 15 నుంచి 26 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. రోడ్లు, ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లోకి వరద నీరు చేరింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.