SRH వల్ల చాలా బాధ పడ్డా: వార్నర్ (వీడియో)

82చూసినవారు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర బాధకు గురిచేసిందని ఆ జట్టు మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వాపోయాడు. ఆ జట్టుకు దూరమైన అనంతరం తనను సోషల్ మీడియా వేదికగా బ్లాక్ చేశారని, ఇది తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెప్పాడు. ఆ జట్టు ప్లేయర్‌గా, కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం ఆడానని, ఛాంపియన్‌గా కూడా నిలబెట్టానని, కనీసం ఆ గౌరవం కూడా లేకుండా బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్