భార్య కళ్ల ముందే భర్త మృతి (వీడియో)

171981చూసినవారు
యూపీలోని ఆగ్రాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై దంపతులు వేగంగా వెళ్తూ, తమ ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌‌టేక్ చేయబోయారు. ఇంతలో ఓ కారు వేగంగా వచ్చి వారి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు దంపతులు బైక్ పై నుంచి ఎగిరి కింద పడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో భర్త స్పాట్‌లోనే చనిపోయాడు. తన కళ్ల ముందే భర్త చనిపోవడంతో ఆమె విలపించింది. గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్