కోల్‌కతాతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 5 ఓవర్లు ముగిసే సమయానికి 39 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ హెడ్ డకౌట్ అయ్యాడు. రెండో ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 3 కూడా ఔటయ్యాడు. జట్టు 39 పరుగుల వద్ద నితీష్ రెడ్డి 9, షాబాజ్ 0 వరుస బంతులకు ఔటయ్యారు. దీంతో హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్లాసెన్ 4*, త్రిపాఠి 24* క్రీజులో ఉన్నారు.