చెన్నైపై హైదరాబాద్ ఘన విజయం

1554చూసినవారు
చెన్నైపై హైదరాబాద్ ఘన విజయం
హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించింది. ట్రావిస్ హెడ్ 31, అభిషేక్ శర్మ 37, మార్‌క్రమ్ 50, షహ్‌బాజ్ అహ్మద్ 18 రన్స్‌తో రాణించారు. మొయిన్ అలీ 2 వికెట్లు, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ చెరో వికెట్ తీశారు. కాగా ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది రెండో విజయం.

సంబంధిత పోస్ట్