నేడు కుల వర్గ జమిలి పోరాట సిద్ధాంత కర్త, అస్థిత్వ పోరాట ప్రతీక కుల సంఘాల ఆధ్యుడు, మహాజన ఫ్రంట్, తెలంగాణ మహాసభ నిర్మాత మారోజు వీరన్న 25వ వర్ధంతి. దేశంలో సమకాలీన రాజకీయాల్లో తరచూ చర్చనీయాంశంగా మారిన వ్యక్తి వీరన్న. విప్లవ, ప్రగతిశీల శిబిరంలో ఆయన చూపిన మార్గం ఇప్పటికీ చిరస్మరణీయంగా ఉంది. చిన్న వయస్సుల్లోనే పాలకుల రాజ్యహింసకు బలైనప్పటికీ ఆయన అందించిన మార్గం దళిత,బహుజన వర్గాలకు మార్గదర్శకంగా నిలిచింది.