పాకిస్థాన్ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ బుధవారం జాతీయ అసెంబ్లీలో భారత్, పాక్ విజయాల మధ్య సమాంతరాలను చూపించారు. భారత్ చంద్రయాన్ విజయాన్ని కరాచీలో అనిశ్చిత పరిస్థితిని పోల్చారు. 'టీవీలో చంద్రుడిపై భారత్ కాలుమోపినట్లు వార్తలు వచ్చాయి. దానికి కొన్ని సెకన్ల తర్వాత కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన న్యూస్ వచ్చింది. కాలువలో పడిన పిల్లలను కాపాడలేని పరిస్థితిలో పాక్ ఉంది' అని ఆయన వివరించారు.