హైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన అక్షిత్ రెడ్డి(26) అనే యువకుడు అమెరికాలోని చికాగోలో మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అక్షిత్ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 21న స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో ఈతకు వెళ్లగా, ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. శనివారం ఇండియా చేరుకోగా, నిన్న అంత్యక్రియలు పూర్తి చేశారు.