పెద్ద అంబర్ పేట్ పరిధిలోని కుంట్లూర్ ప్రణయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు తెలిపారు. దీంతో జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కొందరు తమ ఇళ్లలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన పుటేజి ఆధారంగా కంపనను తెలుసుకుంటున్నారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో భూమి సెకన్ల పాటు కంపించింది.