దొంగతనానికి వచ్చాడు. ఫ్లై ఓవర్ నుంచి దూకేశాడు (వీడియో)

85చూసినవారు
దొంగతనానికి వచ్చి ఫ్లై ఓవర్ నుంచి దూకేసిన ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో మంగళవారం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఇనుప రాడ్లను దొంగతనం చేయడానికి వచ్చిన ఓ దొంగ. కూలీలు గమనించి కేకలు వేయడంతో ఫ్లైఓవర్ నుంచి దూకేశాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆ దొంగను పాతబస్తీకి చెందిన రాములుగా గుర్తించారు. మద్యం మత్తులోనే అతను ఇదంతా చేశాడని పోలీసులు తేల్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్