సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం కాల్పుల కలకలం రేగింది. స్థానికుల వివరాలు. అంబర్ పేట్ కు చెందిన బాల్విందర్ సింగ్, మన్విత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి ఆమెను అమెరికాకు పంపించారు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు అమ్మాయి తండ్రితో వాగ్వాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న ఎయిర్ గన్ తో కాల్చాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.