రాచకొండ కమిషనరేట్ నేరేడ్ మేట్ కార్యాలయం ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీ సుధీర్ బాబు నేతృత్వంలో డీసీపీ, ఏసిపి సీఐలు మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ. పోలీస్ సేవలు సవాళ్లతో కూడుకున్నవని, అధికారులు నిబద్ధతతో తమ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సమిష్టి కృషితో పాటు నేర నిరూపణలో అగ్రగామిగా నిలవాలని సీపీ అన్నారు.