రామనస్థపుర డివిజన్ పరిధిలో అభివృద్ది పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని కార్పొరేటర్ ఖదీర్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని మధిన కాలనీలో కార్పొరేటర్ పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.