ఆరంఘార్ ఫ్లై ఓవర్ ను నేడు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమానికి ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ ర్యాలీగా వెళ్లారు. శాస్ట్రీపురం డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ ర్యాలీగా వెళ్లారు. ర్యాలీలో ఎంఐఎం కార్పొరేటర్లు మహ్మద్ నవాజుద్దీన్, జాఫర్ ఖాన్ పాల్గొన్నారు.