సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ల పోస్టింగ్ కౌన్సెలింగ్లో పోస్టింగ్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని నర్సింగ్ స్టాఫ్ ఆఫీసర్స్ ఆరోపించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం జరగాలంటూ శుక్రవారం రాత్రి హైదరాబాద్ కోఠి చౌరస్తా వద్ద రోడ్డు పై బైఠాయించి తమ గోడు విన్నవించుకున్నారు. కౌన్సిలింగ్ పేరిట "హెడ్ నర్స్, ఆపై స్థాయిలో ఉండే అధికారులు తాము ఎంచుకునే స్థానంలో పోస్టింగులు కోసం తెర వెనుక డబ్బులు ఆశిస్తున్నారన్నారు.