ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంపై మాల సంఘాల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ, బుధవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాల సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంతో, ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.