హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి శుక్రవారం మహిళ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళ కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.