వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నీదికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం అందజేసింది. గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఏంవీఎస్ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చి విరాళం అందించినందుకు సీఎం వారిని అభినందించారు.