ప్రతి రోజు ఉదయాన్నే నానబెట్టిన శనగలను తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ కూడా లభిస్తాయి. వీటిని తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా తోడ్పడతాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి.