బంజారాహిల్స్ లోని సెలూన్ లో అగ్ని ప్రమాదం

4702చూసినవారు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లోని ఓ సెలూన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఏసీ షర్ట్ సర్క్యూట్ కావడంతోనే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్