ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు బి ఎల్ ఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ కు కూడా నోటీసులు ఇవ్వనున్నారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో మరోసారి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.