ఇలా బండి నడిపితే మూడేళ్లు జైలుకే..!

1900చూసినవారు
ఇలా బండి నడిపితే మూడేళ్లు జైలుకే..!
గ్రేటర్ హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇక నుంచి రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాదాలను నివారించేందుకు రాంగ్ రూట్ డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్