హైదరాబాద్: మహా శివరాత్రికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

66చూసినవారు
మహా శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో, వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి వంటి ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్