జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 లోని స్క్రీన్ క్లినిక్ లో అద్దాలు ధ్వంసం చేసి సిబ్బందిపై ఓ మహిళ గురువారం దాడికి పాల్పడింది. అద్దం ముక్క తీసుకుని పొడిచి చంపేస్తా అంటూ బెదిరింపులకు దిగింది. కుమార్తె అందంగా కనబడాలని క్లినిక్ లో పర్వీన్ బేగం అనే మహిళ ట్రీట్ మెంట్ ఇప్పిస్తుండగా, రూ. 2. 19 లక్షల ప్యాకేజీలో రూ. 1 లక్ష ఇచ్చింది. మిగిలిన డబ్బులు ఇవ్వాలని సిబ్బంది అడగగా వీరంగం సృష్టించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.