కార్వాన్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏసు బోధించిన శాంతి బోధనలు ప్రపంచానికి ఆధర్షణీయమన్నారు. మానవాళికి ఏసు అందించిన శాంతి, ప్రేమ, కరుణ చిరస్మనియమైనవన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.