సీవరేజి లైన్ పునరుద్దరణతో సమస్యలు దూరమవుతాయని నానాల్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నాజిరుద్దీన్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని ఖాదర్ బాగ్ లో కొనసాగుతున్న సీవరేజి లైన్ పునరుద్ధరణ పనులను కార్పొరేటర్ పరిశీలించారు. డివిజన్ వ్యాప్తంగా ఈ పునరుద్ధరణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు.