హైదరాబాద్‌: కరెంట్‌ ఖాతాల ద్వారానే ఎక్కువగా సైబర్‌ నేరాలు

51చూసినవారు
హైదరాబాద్‌: కరెంట్‌ ఖాతాల ద్వారానే ఎక్కువగా సైబర్‌ నేరాలు
సైబర్‌ నేరాల వల్ల ఈ ఏడాది హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ.297 కోట్లు పోగొట్టుకున్నారని కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదివారం తెలిపారు. పరువు పోతుందనే ఉద్దేశంతో చాలా మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదని తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ వార్షిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డయల్‌ 100కి వస్తున్న ఫిర్యాదులపై స్పందన పెరిగిందన్నారు. ఫిర్యాదులు అందిన తర్వాత ఘటనాస్థలికి వెళ్తున్న సమయం బాగా తగ్గిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్