రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని కుటుంబ సభ్యులను కవిత శనివారం పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ సగటున పది రోజులకో బిడ్డ ప్రాణం పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.