63 లక్షల మంది మహిళా సంఘం సభ్యులకు యూనిఫామ్ గా చీరలు ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి సీతక్క గురువారం చీరలను పరిశీలించారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ పలు రకాల చీరలను మంత్రికి చూపించారు. మొదటిసారి మహిళా సంఘాలకు ప్రభుత్వం యునిఫామ్ లను పంపిణీ చేయనుంది.