ఆగష్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాపన్న గౌడ్ బహుజన రాజ్యం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహనీయుడని అన్నారు.