పంజాగుట్ట పూట్ ఓవర్ బ్రిడ్జి నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారుల పర్యవేక్షణ చర్యలు లోపించడంతో పూట్ ఓవర్ బ్రిడ్జి మందుబాబులకు అడ్డాగా మారుతోంది. పూట్ ఓవర్ బ్రిడ్జి వద్ద లిఫ్టు పనిచేయడం లేదని ఎస్కలెటర్ కూడా పాడైపోయింది. దీన్ని ఇప్పటివరకు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో పాదచారులు కూడా రావడం మానేశారు. ఇదే అదునుగా పలువురు బాటసారులు ఇక్కడ నిద్రిస్తున్నారని, ఇది రాకపోకలకు అంతరాయంగా మారిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.