రేపు భాగ్యనగరంలో ట్రాపిక్ ఆంక్షలు

78చూసినవారు
రేపు భాగ్యనగరంలో ట్రాపిక్ ఆంక్షలు
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం ట్రాపిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు ట్రాపిక్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 26న ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాపిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఇస్కాన్ టెంపుల్, అబిడ్స్ లో ట్రాపిక్ ఆంక్షలు విధించారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని కోరారు.

సంబంధిత పోస్ట్