అమ్మాయి ప్రేమ నిరాకరించిందని ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జీడిమెట్లలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. టీఎస్‌ఐఐసీ కాలనీకి చెందిన ఎం.రాజశేఖర్ (31) ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నాడు. ఇతడు ఓ అమ్మాయిని ప్రేమించమంటూ వెంటపడుతూ ఉండడంతో ఆమె అందుకు నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.