కూకట్ పల్లిలో ముగిసిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు ముగింపు వేడుకలను శనివారం మూసాపేట్ లోని రాయల్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు.