ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన దశరథ్, అజయ్ ఇద్దరు గతేడాదిగా నాగోలు ప్రాంతంలో ఉంటూ పెయింటర్ గా పని చేస్తున్నారు. ఈ నెల 8న అజయ్ పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం పని ముగించుకొని ఇంటికొచ్చిన దశరథ్ తలుపులు తట్టినా తీయ లేదు. కిటికీలో నుంచి చూడగా అజేయ్ ఉరే సుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.