బాలిక అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన వినోద్ రామ్ కుటుంబం ఐదు నెలల క్రితం జల్ పల్లి శ్రీరాం కాలనీకి వలస వచ్చింది. అతని చిన్న కూతురు కాలనీలోని పేపర్ ప్లేట్స్ తయారీ కంపెనీలో పని చేస్తోంది. ఈ నెల 15న కుటుంబ సభ్యులంతా నిద్రించి శనివారం ఉదయం 6గంటలకు లేచి చూడగా కనిపించలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.