ఇంటి ముందు పార్క్ చేసిన బైకును ఎత్తుకెళ్లిన దొంగలు

79చూసినవారు
ఇంటి ముందు పార్క్ చేసిన బైకు చోరికి గురైంది. బాధితుడు తెలిపిన వివరాలు. యూసుఫ్ గూడా కృష్ణ నగర్ బీ బ్లాకులో ఉండే యాదగిరి రోజూలాగే మంగళవారం కూడా రాత్రి తన బైకును ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. ఎదురుగా ఉన్న సీసీ కెమెరా చెక్ చేసి చూడగా ఇద్దరు దొంగలు వచ్చి బైకును తీసుకెళ్లడం కనిపించింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్