బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మాకు బీఆర్ఎస్ పట్ల ద్వేషం లేదు. ప్రజలే వాళ్లని శిక్షించారు. బాధ్యతగా మంచి సలహాలు ఇవ్వాలి. ప్రతిపక్షంగా యాసిడ్ దాడి లాంటి మాటలు మాట్లాడితే రాష్ట్రానికి నష్టం' అని అన్నారు. అయితే బుధవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాదనలు వాడీవేడీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.