తెలంగాణలో కొత్త మంత్రులు వీరే!

56చూసినవారు
తెలంగాణలో కొత్త మంత్రులు వీరే!
తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందనే ఆసక్తి పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, శ్రీహరి ముదిరాజ్ పేర్లతో ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఈ నలుగురికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్