అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కార్పొరేటర్

75చూసినవారు
ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ షఫీయుద్దీన్ బుధవారం తనిఖీ చేశారు. అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి పిల్లల హాజరు శాతంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం స్థానికంగా కొనసాగుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేసి కమ్యూనిటీ హాల్ ను అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్