పేద ప్రజలకు ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిపై గోషామహల్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని గోషామహల్ బీఆర్ఎస్ నేత ఆనంద్ కుమార్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు మంగళవారం మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గోషామహల్ నియోజకవర్గంలో మురికివాడలు అధికంగా ఉన్నాయని వివరించారు.