హైదరాబాద్ రాయదుర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృత్యువాత పడింది. శ్రీవాణి (21) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సోమవారం మరో వ్యక్తితో బైకుపై వెళ్తుండగా వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీవాణి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కామారెడ్డి వాసిగా గుర్తించారు.