భగవద్గీత సారాంశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి ఆచరించే విధంగా కృషి చేయడమే మా లక్ష్యమని ఇస్కాన్ ప్రతినిధి ప్రేమ్రతన్ తెలిపారు. బుధవారం మాదన్నపేట్ మార్కెట్ గోశాలలో అభిషేకం నగర్ సంకీర్తనల కార్యక్రమం జరిగింది. అబిడ్స్ ఇస్కాన్ ప్రతినిధి ప్రేమ్రతన్ ఆయన బృందం విచ్చేసి మాదన్నపేట్ లో సంకీర్తనలు చేపట్టి హరే కృష్ణ హరే రామ్ మంత్రాన్నీ జపించారు. అనంతరం గోశాలలోని భగవాన్ శ్రీ కృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేశారు