మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి జన్మదిన వేడుకలు మల్కాజిగిరి బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్ లో వాజపేయి నగర్లో అటల్ బిహారీ వాజపేయి జన్మదిన వేడుకల్లో భాగంగా గోపురమణారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు