సిటీలో న్యూ ఇయర్ వేడుకలు సందడిగా కొనసాగుతున్నాయి. మరోవైపు యూత్ విందు, వినోదాలతో ఎంజాయ్ చేస్తున్నారు. కేకులు, బిర్యాని తదితర ఐటెమ్స్ కోసం జనలు బెకరీలు, హోటల్స్ ముందు పడిగాపులు కాస్తున్నారు. దీంతో దుకాణాలు రద్దీగా మారాయి. ఈ క్రమంలో కొంపల్లి పరిధిలో సూచిత్రలోని ఓ రెస్టారెంట్ వద్ద బిర్యాని కోసం ఓ వైపు కస్టమర్లు, మరోవైపు ఫుడ్ డెలివరీ బాయ్స్ దాదాపు అర కిలోమీటరు మేర క్యూ లైన్లో భారులు తీరారు.