బడుగు బలహీన అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం గుడ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కండ్లకోయ మాజీ సర్పంచ్ లు కె. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు.